
ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి సినిమా కలక్షన్స్ సాధించాలనే ఉద్దేశంతో ఇష్టమొచ్చిన విధంగా టికెట్లు రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేటు పెరిగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏపి లో అయితే ఈ సినిమా కోసం ఏకంగా ఓ వారం పాటు రోజుకి ఆరు షోలు వేస్తున్నారట. ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక అమెరికాలో కూడా బాహుబలి ఫీవర్ బాగా ఉందని తెలుస్తుంది.
అక్కడ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో సినిమా టికెట్ ధరను భారీగా పెంచేశారట. రెగ్యులర్ గా అమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలే అక్కడ 10 టూ 15 డాలర్స్ అమ్ముతుండగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి హీరోల సినిమాలు 25 డాలర్స్ కు అమ్ముతున్నారట. ఇక బాహుబలి-2 అయితే టికెట్ రేటు ఏకంగా 33-42 డాలర్ల దాకా పెంచారట. ఈ విషయంపై అక్కడ ఓ సిని అభిమాని మీడియాకు ఓ మెయిల్ చేశాడు. బాహుబలి టికెట్ల కోసం జనాలు బలి అవుతున్నారని.. ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచి రికార్డులను క్రియేట్ చేశామని గొప్పలు చెప్పుకుని ఏం లాభమని అంటున్నాడు.
భారీగా కలక్షన్స్ రాబట్టేందుకు టికెట్లు రేట్లు పెంచి అదేదో జనాల కోసం సినిమాలు తీస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని.. ఈ దోపిడికి అడ్డు వేయాలని ఆ సిని ప్రేక్షకుడు తన విజ్ఞప్తి చేశాడు. మరి దీనికి బాహుబలి నిర్మాతల నుండి ఏదైనా రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.