
నాచురల్ స్టార్ నాని మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మ్యూజికల్ హిట్ మూవీ నేను లోకల్. నాని కెరియర్ లో సూపర్ హిట్ గా హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన నేను లోకల్ మూవీకి డిఎస్పి మ్యూజిక్ ఎంతో హెల్ప్ అయ్యింది. యూత్ ఎంతగానే ఇష్టపడే సాంగ్స్ ఇచ్చిన దేవి మరోసారి నాని సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా ఎం.సి.ఏ. ప్రేమం బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం కావాలని సెట్ చేశారట. ప్రస్తుతం స్టార్ హీరోలకు మాత్రమే మ్యూజిక్ ఇస్తూ బిజీ షెడ్యూల్ తో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ నానికు కూడా మ్యూజిక్ అందించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ మ్యూజిక్ ఆల్బం ఎలా ఉండబోతుందో చూడాలి.