
ప్రస్తుతం సిని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి-2. ఏప్రిల్ 28న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఆడియెన్స్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్నారు. ఇక వాటిని పెంచేందుకు రాజమౌళి ఒక్కో అస్త్రం సంధిస్తున్నారు. సినిమా ట్రైలర్ తో వారెవా అనిపించిన జక్కన్న లేటెస్ట్ గా సాహోరె బాహుబలి సాంగ్ ప్రోమోతో మరోసారి ఆడియెన్స్ ను అబ్బురపరచాడు.
బలిబలిబలిరా బలి సాహోరె బాహుబలి.. అంటూ వచ్చే ఈ సాంగ్ లో అమరేంద్ర బాహుబలి ప్రస్థానం గురించి చూపించారు. కచ్చితంగా మళ్లీ ప్రేక్షకులందరికి విజువల్ ఫీస్ట్ అని చెప్పకనే చెప్పాడు. అంచనాలను పెంచేలా ఉన్న ఈ వీడియో కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ప్రోమో సాంగ్ తోనే కేక పెట్టిస్తున్న బాహుబలి-2 ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేసేలా మరోక్కసారి బాహుబలి-2 గర్జన వినబడుతుంది. మరి ఆ సౌండ్ కు కలక్షన్స్ లు ఏ రేంజ్ లో మోగిపోతాయో చూడాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.