ఒక్కడు-2 స్క్రిప్ట్ రెడీ..కాని..!

మహేష్ కెరియర్ ఒక్కడు ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమానో తెలిసిందే. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మహేష్ ఇమేజ్ అమాంతం పెంచేసింది. అదే సినిమాను కోలీవుడ్ లో విజయ్ గిల్లి గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మహేష్ కు మాస్ ఇమేజ్ తెచ్చినట్టుగానే ఇళయదళపతి విజయ్ కెరియర్ కు ఆ సినిమా సక్సెస్ సూపర్ గా ఉపయోగపడింది. ధరణి డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వల్ కథ సిద్ధం చేశాడట ఆ రీమేక్ డైరక్టర్.

అదేంటి ఒక్కడు సీక్వల్ చేస్తే కనుక గుణశేఖర్ చేయాలి కాని ధరణి ఎలా అంటే. ఒక్కడు తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో గుణశేఖర్ కు ఛాన్స్ ఇచ్చాడు మహేష్. కాని ఆ రెండు ఫలితాలు నిరాశ పరచడంతో ఒక్కడు సీక్వల్ అని ఒక కథ సిద్ధం చేసినా నో చెప్పాడట మహేష్. ఇప్పుడు ధరణి అదే ఒక్కడు సీక్వల్ గా విజయ్ తో గిల్లి-2 సినిమా చేయబోతున్నాడట. విజయ్ కథ వినడం జరిగిందట.. అతని నుండి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం సినిమా స్టార్ట్ చేయడమే అంటున్నాడు ధరణి. ఈ ధరణి ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తీసిన దర్శకుడే.. మరి అక్కడ విజయ్ ఒకే చెప్పగానే ఇక్కడ మహేష్ తో కూడా డిస్కస్ చేసి తెలుగులో కూడా ఒక్కడు-2 చేస్తాడేమో చూడాలి.