
సూపర్ స్టార్ రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న మూవీ 2.0. 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ దశ చివరు చేరుకున్న ఈ సినిమా ముందు వేసవిలో రిలీజ్ అని అన్నారు. కాని మధ్యలో రజిని అనారోగ్యం కారణంగా అది పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ ఇయర్ దీవాళికి 2.0 రావడం పక్కా అన్నారు. కాని ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం కష్టమే అని అంటున్నారు.
2018 జనవరి 25న గురువారం రోబో సీక్వల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే లేట్ అవుతుందట. శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 2.0తో ఇండియన్ సినిమా రికార్డులన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న 2.0 మూవీలో రజిని మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని టాక్.