
మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో తెలుగు తమిళ భాషల్లో వస్తున్న సినిమా స్పైడర్. ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అని డైరక్టర్ మురుగదాస్ కన్ఫాం చేశాడు. క్లైమాక్స్ కు సంబందించిన షూటింగ్ పూర్తి కాకపోవడంతో అనుకున్న టైం కు రిలీజ్ కష్టమే అని అంటున్నారు. మహేష్ రావట్లేదని కన్ఫాం చేసుకున్న స్టైలిష్ స్టార్ తను ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో చేస్తున్న దువ్వాడ జగన్నాథం మూవీని ఆ డేట్ న రిలీజ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ బ్రాహ్మిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అసలైతే మే 19న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల జూన్ 23న వస్తుంది. మహేష్ ఫిక్స్ చేసిన డేట్ కు వస్తున్న బన్ని ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడో. ఇక జూన్ 23 నుండి పోస్ట్ పోన్ అయిన స్పైడర్ మూవీ ఆగష్టులో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.