బాహుబలిలో నేను చిన్న వర్కర్ ను మాత్రమే..!

ఎట్టకేలకు కన్నడిగులకు కట్టప్ప సత్యరాజ్ క్షమాపణలు చెప్పాడు. 9 సంవత్సరాల క్రితం కావేరి నదీజలాల విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడాడని సత్యరాజ్ నటించిన బాహుబలి-2 సినిమా మీద కక్ష సాధించాలని చూశారు. ఏప్రిల్ 28న ఆ సినిమా రిలీజ్ రోజున కర్ణాటక బంద్ కు పిలుపినిచ్చారు. విషయం తీవ్రతరం కావడంతో నిన్న రాజమౌళి కన్నడంలో అందరికి తన విన్నపాన్ని తెలిపాడు ఇప్పుడు సత్యరాజ్ కూడా కన్నడిగులను విన్నవించుకున్నాడు.

9 ఏళ్ల క్రితం కావేరి జలాల విషయంలో మాట్లాడిన మాటలు కన్నడ ప్రజలను బాధించాయని అర్ధమైంది. తాను కనడ వ్యతిరేకిని కాదని 35 ఏళ్లుగా తన అసిస్టెంట్ గా పనిచేస్తున్న శేఖర్ కన్నడిగుడే అని అన్నారు. నా ప్రేమ గురించి చెప్పడానికి అంతకంటే ఇంకేం కావాలి.. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారికి నా క్షమాపణలు చెబుతున్నాను.

బాహుబలిలో నేనొక వర్కర్ ను మాత్రమే.. నా వల్ల ఈ సినిమా రీలీజ్ ఆగిపోకూడదు.. ఇదే విషయాన్ని అటు కన్నడిగులు.. ఇటు తమిళులు అర్ధం చేసుకోవాలని అన్నారు సత్యరాజ్. కట్టప్ప స్టేట్మెంట్ తో కన్నడిగులు శాంతించి బాహుబలి-2 రిలీజ్ అయ్యేలా చూస్తారేమో చూడాలి.