
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అని డైరక్టర్ మురుగదాస్ ఎనౌన్స్ చేశాడు కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ సినిమా రావట్లేదని తెలుస్తుంది. షూటింగ్ అనుకున్న టైంలో కాకపోవడంతో రిలీజ్ ను వాయిదా వేయడం కన్ఫాం అంటున్నారు.
మహేష్ సినిమా రావట్లేదని నాని కన్ఫాం చేశాడు. అదెలా అంటే నాని తర్వాత సినిమా నిన్ను కోరి సినిమా జూన్ 23న రిలీజ్ అని కన్ఫాం చేశాడు. మహేష్ సినిమా కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని తెలిసే నాని 'నిన్ను కోరి' వస్తున్నాడని అంటున్నారు. శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి మహేష్ రాడని తెలుసుకునే నాని వస్తున్నాడా లేక మహేష్ తో పోటీకి వస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.