బాహుబలి-2 టికెట్ రేట్లు పెరుగుతున్నాయ్

ప్రస్తుతం సిని ప్రియులంతా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిందే. బిగినింగ్ తో ఎన్నో సంచలనాలను సృష్టించిన బాహుబలి మూవీ రాబోతున్న ఈ పార్ట్ తో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తుంది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూస్తుంటే సినిమాను ఇప్పటివరకు చూడని రేంజ్లో అందరు వీక్షించేలా ఉన్నారు.

ఈ క్రమంలో సినిమా టికెట్ ధర పట్టించుకుంటారా సమస్యే లేదు. అందుకే బాహుబలి-2 టికెట్ ధర పెంచేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాహుబలి నిర్మాతలు. దాదాపు గవర్నమెంట్ కూడా అందుకు ఓకే చెప్పిందని టాక్. అంతేకాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను 5 షోలు వేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా దాదాపు కన్ఫాం అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఓ వైపు టికెట్ ధర పెంచడమే కాకుండా ఐదు షోలతో బాహుబలి-2 చేసే కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.