
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలిసిందే.. ఆ లక్కీ ఛాన్స్ నందితకు దక్కిందని అంటున్నారు. నీకు నాకు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నందిత ప్రేమ కథా చిత్రం సినిమాతో పాపులర్ అయ్యింది.
హీరోయిన్ గా కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేని నందిత ఎన్.టి.ఆర్ సినిమా ఛాన్స్ అనేసరికి ఎగిరిగంతేసిందట. సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నదే అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు. పెద్ద సినిమాలో భాగమైనందుకు నందిత సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే చిత్రయూనిట్ మాత్రం నందిత రోల్ గురించిన విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుంది.