
బుల్లితెర మీద చిన్నారి పెళ్లికూతురుగా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను మెప్పించిన అవికా గోర్.. ఆ క్రేజ్ తో తెలుగులో ఉయ్యాల జంపాల ఆఫర్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో మంచి అవకాశాలే అందుకుంది. అభినయం ఎంత కనబరచినా అమ్మడి ఆకారం ఆమెకు అవకాశాలు రాకుండా చేసింది. రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడాలో అయితే అవికా మరి అధ్వానంగా అనిపించింది.
ఇక ప్రస్తుతం ఇక్కడ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం హింది టివి షోలో యాంకర్ గా కెరియర్ సాగిస్తుంది అవికా. మనీష్ రాయ్ తో చేస్తున్న టివి షో సూపర్ క్లిక్ అవడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు వచ్చాయి. ఇక మీడియా అయితే అవికా మనీష్ రాయ్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ కన్ఫాం చేశారు. ఈ వార్తలపై మొత్తానికి నోరు విప్పింది అవికా గోర్. అతను తనకు స్నేహితుడు మాత్రమే అయినా అంత పెద్ద అతనితో డేటింగ్ చేస్తున్నానని ఎలా అనుకుంటారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై అరకొర అవకాశాలే వస్తుండటంతో బుల్లితెర మీద వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో చేస్తున్న ప్రోగ్రాంలో అలా కలరింగ్ ఇస్తుందన్నమాట. మరి డేటింగ్ పై అమ్మడు ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.