
యూనివర్సల్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమా గుర్తుండే ఉంటుంది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇక అదే ఊపుతో విశ్వరూపం-2 కూడా తీశాడు కమల్ హాసన్. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీసి ప్రేక్షకులను మెప్పించిన కమల్ హాసన్ విశ్వరూపం-2 మాత్రం రిలీజ్ చేయలేకపోయాడు. విశ్వరూపం-2 ప్రొడక్షన్ లో ఉండగానే ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడటంతో చేతులెత్తేశాడు.
ఇక చాన్నాళ్ల తర్వాత మళ్లీ కమల్ ఆ సినిమాను తన సొంత బ్యానర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కమల్ ఆధ్వర్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారట. ఈ సంవత్సరంలోనే విశ్వరూపం-2 రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న శభాష్ నాయుడు సినిమాను ఆపేసి విశ్వరూపం-2 మీద దృష్టి పెట్టాడు కమల్ హాసన్. మరి కమల్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతున్న విశ్వరూపం సెకండ్ పార్ట్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.