చైతు సమంత పెళ్లి ఎప్పుడంటే..!

అక్కినేని నాగ చైతన్య సమంతల నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వీరి మ్యారేజ్ డేట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి అక్టోబర్ లో ఉంటుందని అంటున్నారు. హిందు, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో పెళ్లి జరుపుతారట. 

ముందు హైదరాబాద్ లో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఆ తర్వాత చెన్నైలో క్రిస్టియన్ పద్ధతిలో చర్చిలో మ్యారేజ్ చేసుకుంటారట. ప్రస్తుతం ఇద్దరు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో వస్తుండగా.. సమంత తమిళంలో రెండు సినిమాలతో పాటుగా తెలుగులో సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకుని వీరి పెళ్లి కోసం కాస్త గ్యాప్ తీసుకోనున్నారట.