అక్కినేని అఖిల్ రెండో సినిమా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ మూవీ హైదరాబాద్ మైట్రో స్టేషన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పనిచేస్తుండటం విశేషం. నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా అఖిల్ రీ లాంచింగ్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. అఖిల్ హీరోగా మొదటి సినిమా అఖిల్ వినాయక్ డైరక్షన్ లో వచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో ఏడాదిన్నర గ్యాప్ తో విక్రం సినిమాకు ఫిక్స్ అయ్యాడు అఖిల్.
40 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా అఖిల్ కు అదిరిపోయే హిట్ అందించేలా డైరక్టర్ విక్రం తెరకెక్కిస్తున్నారు. మరి సినిమా ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.