కర్ణాటకలో బాహుబలి-2 రిలీజ్ కష్టాలు..!

తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి సినిమా ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో ఓ పక్క బిజీగా ఉన్న చిత్రయూనిట్ కు కన్నడలో ఈ సినిమా రిలీజ్ పై వస్తున్న అడ్డంకులు తొలిగేలా కనబడట్లేదు. బాహుబలిలో నటించిన కట్టప్ప అదేనండి సత్యరాజ్ ఎప్పుడో కావేరి జలాల గొడవల్లో తమిళనాడుకి సపోర్ట్ గా మాట్లాడాడని అతను నటించిన బాహుబలి-2 రిలీజ్ కు అడ్డుపడుతున్నారు. 

ఈ విషయంపై రాజమౌళి ఎంత వాదించినా అక్కడ జనాలు పట్టించుకోవట్లేదు. ఇక ఒకవేళ కాదు కూడదు అని రిలీజ్ చేస్తారేమో అని ఏకంగా ఆరోజు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. ఓ రకంగా బాహుబలి-2కి ఇదో దెబ్బ అని చెప్పొచ్చు. మరి ఈ సమస్యను బాహుబలి-2 నిర్మాతలు అక్కడ నిర్మాతల మండలితో మాట్లాడి సెట్ చేస్తారేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేసి భారీ కలక్షన్ సాధించాలనే ఆలోచనలో ఉన్న బాహుబలి-2 చిత్రయూనిట్ కు పెద్ద షాక్ తగిలినట్టైంది. కన్నడలో బాహుబలి-2 రిలీజ్ ఉంటుందా లేదా అన్నది మరో కొద్దిరోజుల్లో తెలుస్తుంది.