
స్టార్ హీరోయిన్ సమంత డెడికేషన్ గురించి అందరికి తెలిసిందే.. ఏమాయ చేసావే సినిమా నుండి జనతా గ్యారేజ్ వరకు సమంత గ్రాఫ్ ఎలా పెరిగిందో తెలిసిందే. కష్టే ఫలి అని నమ్మే శ్యామ్స్ ప్రతి సినిమా తన మొదటి సినిమాలానే కష్టపడుతుంది. ప్రస్తుతం సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో మూవీ ఛాన్స్ పట్టేసిన సమంత ఆ సినిమా కోసం కత్తిసాము నేర్చుకుంటుంది.
పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో చరణ్ తో పాటు సమంత కూడా కొత్త పాత్రలో కనిపిస్తుందట. ఓ జమిందారి కుటుంబంలో అమ్మాయిగా కనిపించబోతున్న సమంత సినిమాలో ఓ సందర్భంగా కత్తిసాము (కర్ర ఫైట్) చేయాల్సిన అవసరం ఉందట. అందుకే శ్యామ్స్ ఇప్పుడు అది నేర్చుకునే పనిలో పడ్డది. ప్రస్తుతం సమంత కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చూస్తుంటే సమంతకు ఈ మూవీ తన హిట్ సినిమాల ఖాతాలో చేరేలా ఉంది.