
నందమూరి వారసుడు నట సింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అన్నది అందరికి తెలిసిన విషయం. కాని ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే మోక్షజ్ఞకు సినిమాలంటే ఇష్టం లేదట. తనకు బిజినెస్ చేయాలనే ఉందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఇదో షాకింగ్ న్యూస్ అయినా సరే అది నిజమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
అయితే ఇలాంటి రూమర్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరంటున్నారు. ఒకవేళ నిజంగానే మోక్షజ్ఞకు సినిమాలంటే ఇష్టం లేకుంటే ఎందుకు తను ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ లు చేస్తాడు. శాతకర్ణి సినిమాకు సహాయక దర్శకుడిగా కూడా మోక్షజ్ఞ పనిచేశాడని తెలిసిందే. మరి సినిమా మీద ఆ మాత్రం ప్యాషన్ ఉండబట్టే ఇవన్ని చేశాడని.. తప్పకుండా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు అభిమాన సంఘాలు. అసలు వాస్తవం ఏంటి అన్నది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.