చరణ్ ప్రయత్నాన్ని ఆపేసిన చిరంజీవి..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తీసే ప్రతి సినిమాకు చిరు సపోర్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ తండ్రి సహకారం లేకుండా ఈ స్టార్ డం మెయింటైన్ చేయడం కష్టమే.. అది కాక స్టార్ హీరోగా మెగాస్టార్ ఇంకా ఫాంలో ఉన్నాడు కాబట్టి కథా చర్చల్లో చిరు కంపల్సరీ అని తెలుస్తుంది. అయితే ఒక్కోసారి మెగా డెశిషన్ కూడా బోల్తాకొడుతుంది అనుకోండి. చరణ్ చేసే సినిమా చేయాలనుకున్న సినిమా.. అసలు ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే కాదు.. స్టోరీ డిస్కషన్ స్టేజ్ లోనే చిరుని ఇన్వాల్వ్ చేస్తాడు.

ఎన్నాళ్లనుండో చరణ్ తో మణిరత్నం సినిమాపై ఊహాగానాలు ఏర్పడ్డాయి. చెలియాకు ముందు చరణ్ కూడా మణి సినిమా మీద తెగ ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే అంచనాలతో వచ్చిన చెలియా కాస్త అట్టర్లీ పోయింది. మణిరత్నం బ్రాండ్ తో వచ్చిన చెలియా తెలుగులోనే కాదు తమిళంలో కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అందుకే చరణ్ మణిరత్నం సినిమాలకు చిరు బ్రేక్ వేశాడని అంటున్నారు. కెరియర్ లో రిస్క్ తీసుకోవాల్సిన టైం ఇది కాదని చరణ్ కు సలహా ఇస్తున్నాడట మెగాస్టార్. బ్రూస్ లీ ముందు హిట్ కోసం తహతహాలాడిన చరణ్ ధ్రువ సక్సెస్ తో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఒకవేళ మణిరత్నం తో సినిమా ఓకే చేస్తే మాత్రం మళ్లీ మిస్టేక్ చేసినట్టే అని అంటున్నారు. మరి ఫైనల్ గా చెర్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం చరణ్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.