
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. విలక్షణ సినిమాలతో కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు సౌత్ సిని ప్రియులను అలరిస్తున్న మోహన్ లాల్ వర్మతో డైరక్షన్ లో సినిమా అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. 2002లో ఈ కాంబినేసన్ లో కంపెనీ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు.
వంగవీటి తర్వాత ప్రస్తుతం అమితాబ్ తో సర్కార్-3 సినిమా చేస్తున్న వర్మ త్వరలో మోహన్ లాల్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తో తెలుగులో కూడా సూపర్ క్రేక్ ఏర్పరచుకున్న మోహన్ లాల్ మనమంతా, మన్యం పులి సినిమాలకు మంచి ఫలితాన్నే అందుకున్నారు. వర్మ సినిమా కాబట్టి కచ్చితంగా ఆ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబోలో ఎలాంటి సినిమా తెరకెక్కుతుందో చూడాలి.