మహేష్ ను టార్గెట్ చేసిన బన్ని..!

సూపర్ స్టార్ మహేష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఫైట్ కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్ని చేస్తున్న దువ్వాడ జగన్నాధం, మహేష్ చేస్తున్న స్పైడర్ రెండు ఒకే డేట్ కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న డిజె ముందు మే 19కి రిలీజ్ అనుకున్నారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ కన్నా ముందే రిలీజ్ డేట్ జూన్ 23న రిలీజ్ చేశారు.


అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి అవుతుందో లేదో అని స్పైడర్ కూడా రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ఇక డిజె మూవీని కూడా మే నెల నుండి జూన్ 7న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే జూన్ 23న మహేష్ సినిమా రోజే పోటీకి సిద్ధం అంటున్నారట. రంజాన్ తో పాటుగా వీకెండ్ కలిసి రావడంతో 23న ఎలాగోలా సినిమా రిలీజ్ చేయాలని మురుగదాస్ షూటింగ్ స్పీడప్ చేశాడట. మరి అనుకున్న డేట్ కు స్పైడర్ వస్తాడా డిజె స్పైడర్ ల మధ్య పోటీ జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.