
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ అక్కడ స్టార్ హీరో విశాల్ సినిమా రిలీజ్ అయిన వీకెండ్ తర్వాత సోమవారానికి రివ్యూ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనికి కోలీవుడ్ లో కొందరు దర్శక నిర్మాతలు కూడా సపోర్ట్ నిలిచారు. అయితే దీనికి టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాత్రం రివర్స్ గా స్పందించాడు. మీడియాకు రివ్యూ ఇచ్చే స్వేచ్చ ఉందని.. అయినంత మాత్రాన ఒక చెత్త సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చినా ఓ మంచి సినిమాకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినా సినిమా ఫలితాన్ని మాత్రం ఎవరు ఆపలేరని అన్నారు.
చిన్న సినిమాలకు ముందు పాజిటివ్ రివ్యూలు రాయడం వల్ల ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అవుతుందని.. వాటికి ఉదాహరణగా పెళ్లిచూపులు, ఘాజి చిత్రాలని చూశామని అంటున్నారు. అందుకే రివ్యూలను ఆపాలనుకోవడం మంచి నిర్ణయం కాదని అన్నారు. ఒకవేళ మీడియా వాళ్లను ఆపినా సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు రివ్యూ ఇస్తారని వాటిని ఎవరం ఆపలేమని అన్నారు సురేష్ బాబు.