అఖిల్ తో అజయ్ ఫైట్..!

అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్లింది. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో సరికొత్త హీరో క్యారక్టరైజేషన్ తో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా అజయ్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. విక్రం డైరక్షన్ లో వచ్చిన ఇష్క్, 24 సినిమాల్లో కూడా అజయ్ మంచి పాత్రలు ఇచ్చాడు.


ఇక రాబోతున్న అఖిల్ సినిమాలో కూడా విలన్ గా క్రేజీ రోల్ లో కనిపించనున్నాడట అజయ్. రీసెంట్ గా అజయ్ తో చర్చలు జరుపగా కథ వినగానే ఓకే చెప్పేశాడట. 40 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ ను సెలెక్ట్ చేశారని టాక్. సినిమాలో ఫైటింగ్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది. మరి అఖిల్ తో అజయ్ ఫైట్ చేసే ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.