
కోలీవుడ్ బ్యూటీ భావన మీద కొద్ది రోజుల క్రితం లైంగిక వేదింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందుతుడు పల్సర్ సుని మిగతా గ్యాంగ్ మొత్తం పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం ఆ కేసు ఎటు తేలకుండా ఉంది. అయితే వారికి శిక్ష పడేదాకా కేసు వదిలే ప్రసక్తే లేదని అంటుంది భావన. అంతేకాదు ఈమధ్యనే ఓ మలయాళ పత్రికలో భావన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు బయట పెట్టింది.
తనని కిడ్నాప్ చేసిన సమయంలో పల్సర్ సుని తరచు ఓ ఫోన్ కాల్ మాట్లాడే వాడని. అవతల వ్యక్తి ఓ లేడీ అని భావన చెప్పడం విశేషం. మరి ఓ మహిళ అయ్యుండి భావన మీద ఇలాంటి అఘాయిత్యం చేయించడం ఏంటని అందరు షాక్ అవుతున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాతే భావన మలయాళ నిర్మాత నవీన్ ను పెళ్లిచేసుకుంది.