
ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేశాడు మాస్ మహరాజ్ రవితేజ. అందులో ఒకటి అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాజా ది గ్రేట్ కాగా మరోటి విక్రం సిరి డైరక్షన్ లో వస్తున్న టచ్ చేసి చూడు. ప్రస్తుతం రెండు సినిమాలకు పార్లర్ గా షూటింగ్ లో పాల్గొంటున్న రవితేజ గురించి రాజా ది గ్రేట్ హీరోయిన్ మెహెరీన్ కౌర్ అసలు సీక్రెట్ బయట పెట్టింది.
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహెరీన్ కౌర్ ఒక్క సినిమాతోనే యువత మనసు దోచేసింది. ఇక రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మడు సినిమాలో రవితేజ బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్నాడని.. కాని సినిమా తప్పకుండా ప్రేక్షకులు నచ్చేలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటుంది. అంతేకాదు సినిమాలో హీరోకి సమానంగా హీరోయిన్ గా తనకు ప్రత్యేకమైన పాత్ర లభించిందని అంటుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడి.