మ్యారేజ్ పై ప్రభాస్.. నో ఐడియా..!

యంగ్ రెబల్ స్టార్ పెళ్లెప్పుడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి కోసమే పెళ్లి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇక బాహుబలి ఎలాగు పూర్తయిందిగా ఇక పెళ్లి చేసుకోవడమేనా అంటే మాత్రం ఇప్పుడు కూడా నో ఐడియా అంటూ షాక్ ఇస్తున్నాడు ప్రభాస్. పెళ్లి మీద రెబల్ స్టార్ కృష్ణం రాజు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇస్తేనే కాని మీడియా వాళ్లు ఆగలేదు.

ఇక ప్రభాస్ నే డైరెక్ట్ గా అడిగేస్తే పోలా అని.. నేషనల్ మీడియానే ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడని అడిగేసింది. దానికి మాత్రం ప్రభాస్ నో ఐడియా అని సింపుల్ గా తప్పించుకున్నాడు. తన మ్యారేజ్ తన చేతిలో లేదు.. అంతా ఇంట్లో వాళ్లే చూస్తున్నారనే ఉద్దేశంతో చెప్పాడా లేక మ్యారేజ్ విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు అన్నట్టు నో ఐడియా అన్నాడా ఏంటన్నది తెలియలేదు. ఇక ప్రభాస్ మ్యారేజ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.