బ్రహ్మోత్సవం రివ్యూ & రేటింగ్

రేటింగ్: 2/5

కథ:
నలుగురిని కలుపుకుపోతూ కలిసుండడమే జీవితం అని నమ్మే వ్యక్తి సత్యరాజ్. ఎంతో కష్టపడి, ఒడిదుడుకులు ఎదురుకొని ఉన్నత స్థాయికి వస్తాడు. అందుకే అతనంటే కుటుంబంలో అందరికి గౌరవం. ఇది భరించలేని అతడి బావమరిది రావురమేష్ అలాంటి గౌరవం తనకి దక్కడం లేదని రగిలిపోతుంటాడు. తన కూతుర్ని అతడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆ కొడుకు (మహేష్ బాబు) మరో అమ్మాయితో (కాజల్) కలిసి తిరగడం తట్టుకోని అతడు, ఆ కోపాన్ని సత్య రాజ్ దగ్గర చూపిస్తాడు. అది తట్టుకోలేక ఆ తండ్రి ప్రాణం వదిలేస్తాడు. అప్పుడా కొడుకు తన మావయ్యలోని అపార్థాన్ని తొలగించి.. తన తండ్రి గొప్పదనమేంటో అతడికి తెలియజేసే ప్రయత్నమే బ్రహ్మోత్సవం మిగతా కథ.

విశ్లేషణ:

మన మూలాలు వెతుక్కోవడం అనే దాన్ని సినిమా మెయిన్ పాయింట్ గా చెప్పాలనుకున్న శ్రీకాంత్ అడ్డాల తిప్పి తిప్పి క్లారిటీ లేని విధంగా చేసేసాడు. నేరేషన్ అత్యంత నెమ్మదిగా చూపించి టీవీ సీరియల్ కు ఏమాత్రం తీసిపోని వేగంతో సినిమా తీసి, ప్రేక్షకులకు తలపోటు తెప్పించాడు. ఫస్ట్ ఆఫ్ లో పాటలు మరీ ఎక్కువ అవడంతో నస పుట్టిస్తే, సెకండ్ ఆఫ్ లో నేరేషన్ నిద్ర పుట్టిస్తది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఒక్కటి కూడా ఆసక్తి లేవు సరి కదా, విసుగు పుట్టించి, శ్రీకాంత్ అడ్డాల ని ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకునేలా చేస్తాయి. సమంత పాత్ర ఎందుకొచ్చిందో ఎందుకు వెళ్లిందో ఎవరికీ సరిగ్గా అర్ధం కాదు. కాజల్ తో ఉన్న ఆ కొన్ని రొమాంటిక్ సీన్లు బాగున్నాయి.

నటన, సాంకేతికవర్గం:

మహేష్ బాబు మరో సారి తన నటనతో ఆకట్టుకుంటాడు. సినిమాకి తనే ఆయువ పట్టు అనిపిస్తాడు. కాజల్ ఎన్ఆర్ఐ అమ్మాయిలా చేసిన పాత్ర బాగుంటుంది, సమంత అందచందాలు ఆకట్టుకుంటాయి. ప్రణిత చిన్న పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. రావు రమేష్ తన అద్బుతమైన నటన బ్రహ్మోత్సవం సినిమాకి మహేష్ తర్వాత మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సత్యరాజ్ నటన మెప్పిస్తుంది. మిగతా నటులు తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ఇక మిక్కీ జె మేయర్ పాటలు,  గోపీసుందర్ నేపధ్య సంగీతం సినిమా మూడ్ కి తగ్గట్టుగా కరెక్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా భారీగా అనిపిస్తాయి.  సినిమా చూస్తున్నంత సేపు ఒక రిచ్ లుక్ కనిపిస్తుంటుంది. టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ బ్రహ్మోత్సవం లో చెప్పుకోదగిన విషయం. సాగదీసిన స్క్రీన్ ప్లే, పస లేని డైలాగులు బ్రహ్మోత్సవంను ఫ్లాపు బాట పట్టించక తప్పదు.

ఒక్క మాటలో:
రెండున్నర గంటల సీరియల్ ఐన బ్రహ్మోత్సవం, పరమ బోరింగ్.