
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ తో సుక్కు తీసిన కుమారి 21ఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సుకుమార్ మరో సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అశోక్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హరి ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ అన్ని తానై నడిపిస్తున్నడు హరి ప్రసాద్. అయితే సుకుమార్ కుమారి 21ఎఫ్ కథ తనే రాశాడు. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ చూసుకున్నాడు. కాని రాబోతున్న దర్శకుడు సినిమా కేవలం డబ్బులు మాత్రం పెడుతున్నాడు. మరి సుకుమార్ రైటింగ్స్ లో సుక్కు నిర్మిస్తున్న ఈ సెకండ్ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.