బాలయ్య మిస్సైన సింహాద్రి..!

టైటిల్ చూస్తే కొద్దిగా షాక్ అవడం ఖాయం.. యంగ్ టైగర్ క్రేజ్ ను అమాంతం పెంచేసిన సింహాద్రి సినిమా ఒకవేళ ఎన్.టి.ఆర్ కాకుండా బాలకృష్ణ చేసుంటే.. ఆలోచిస్తేనే అదో త్రిల్ కలిగిస్తుంది కదా ఇదే విషయం బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి కథ అసలు ఎన్.టి.ఆర్ కోసం రాసింది కాదట. విజయేంద్ర ప్రసాద్ బాలయ్య కోసం ఆ కథ అనుకున్నాడట కాని అప్పుడు బాలకృష్ణ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాడట.  

స్టూడెంట్ నంబర్ వన్ తో క్రేజీ కాంబినేషన్ గా మారిన రాజమౌళి తారక్ లు మరోసారి కలిసి సింహాద్రి చేశారు. ఇక ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం  తెలిసిందే రీసెంట్ గా ఆ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్ లీక్ అయ్యింది. ఒకవేళ బాలయ్య ఫ్రీ అయ్యి సింహాద్రి బాలయ్య చేసుంటే ఎలా ఉండేదో అని నందమూరి ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. రీసెంట్ గా శాతకర్ణితో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.