
బాహుబలి సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల పని పడుతుంది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. చిత్రయూనిట్ అంతా దేశం మొత్తం చుట్టేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే బాహుబలి సినిమా మరో రికార్డ్ సొంతం చేసుకోబోతుంది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ లో కేవలం అతి తక్కువ సెంటర్స్ లో రిలీజ్ అయ్యేవి. మొట్టమొదటిసారిగా బాహుబలి-2 యూఎస్, కెనడా ప్రాంతాల్లో ఏకంగా 1000 ప్లస్ సెంటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
గ్రేట్ ఇండియా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా ఓవర్సీస్ లో రిలీజ్ అవుతుంది. ఇక అదే రేంజ్ లో ప్రీమియర్ షోలు కూడా వేయాలని చూస్తున్నారట. ఇప్పటిదాకా ఓవర్సీస్ లో ఓపెనింగ్ కలక్షన్స్ లో దంగల్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. 1000 ప్లస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న బాహుబలి-2 కచ్చితంగా సరికొత్త ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ తో పాటు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు చిత్రయూనిట్. మరి ఆ సంచలనం ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో 12 రోజులు వెయిట్ చేయాల్సిందే.