
రీసెంట్ గా వచ్చిన మిస్టర్ అంచనాలను అందుకోకపోవడంతో డైలమాలో పడ్డ మెగా హీరో వరుణ్ తేజ్ ఇక కమర్షియల్ గా ఆలోచించడం మానేసి ప్రయోగాల బాట పట్టనున్నాడని తెలుస్తుంది. ఆ క్రమంలోనే తన తర్వాత సినిమా ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో ఫిక్స్ చేసుకున్నాడట. మొదటి సినిమాతోనే సంకల్ప్ తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. ఘాజి సినిమా సీనియర్ డైరక్టర్స్ ను కూడా ఆశ్చర్యపడేలా చేసింది.
డైరక్టర్ పర్ఫెక్షన్ ఏంటో ఘాజితో తెలిసింది. అందుకే సంకల్ప్ కథ చెప్పగానే ఓకే చెప్పాడట వరుణ్ తేజ్. ఈ కథ కూడా ఎక్సపెరిమెంట్ అనే అంటున్నారు. కంచె తర్వాత మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ హంగులతో తీసిన లోఫర్, రీసెంట్ గా వచ్చిన మిస్టర్ రిజల్ట్ తో వర్రుణ్ తేజ్ చాలా నిరుత్సాహ పడ్డాడు అందుకే ఇక ప్రయోగాలు మాత్రమే చేస్తానని అంటున్నాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్నా ఫిదా సెట్స్ మీద ఉండగా త్వరలో రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తారట. మరి సంకల్ప్ తో వరుణ్ తేజ్ చేస్తున్న ఈ ఎక్సపెరిమెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.