రిప్లై కూడా గట్టిగానే ఇచ్చాడు..!

నేషనల్ అవార్డ్ జ్యూరీ సభ్యుల మీద విమర్శనాస్త్రాలు పడుతూనే ఉన్నాయి. ఈ విషయంపై డైరెక్ట్ గా గొడవలో దిగాడు కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్.. జాతీయ అవార్డులు పక్షపాతంతో ఇచ్చారని మొదటి నుండి చెబుతున్న మురుగదాస్ జ్యూరీ సభ్యులను ఏకిపారేశాడు. అయితే జ్యూరీ సభ్యుడు ప్రియదర్శన్ మురుగదాస్ ను 'గో టూ హెల్' అనడంతో వివాదం మరింత ముదిరింది. 

ఇక రిప్లై కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు మురుగదాస్.. మిస్టర్ జ్యూరీ.. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.. భారతీయ సిని ప్రేక్షకులందరు ఇదే అభిప్రాయంతో ఉన్నారని అన్నాడు. అంతేకాదు వాదించడం కన్నా నిజమేంటో బయట పెడితే మంచిదంటూ స్ట్రాంగ్ ట్వీట్ చేశాడు మురుగదాస్. అయితే మురుగదాస్ ఈ ట్వీట్లకు ప్రియదర్శన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు నేషనల్ అవార్డులొచ్చినా ఇలాంటి గొడవలు సహజం కాని ఈసారి వివాదం మాత్రం కాస్త ఎక్కువ ఇంపాక్ట్ కలుగ చేస్తుంది.