హీరోయిన్ భర్తతో మెగా హీరో ఫైట్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఎన్నో అంచనాలతో వచ్చిన విన్నర్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. జవాన్ సినిమాలో హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న విలన్ గా చేస్తున్నాడట. ఈమధ్య హీరోయిన్ల భర్తలు విలన్లు చేయడం మొదలు పెట్టారు కాస్త కూస్తో స్క్రీన్ మీద పరిచయం ఉన్న ఫేస్ లు కావడం చేత వారిని విలన్స్ గా చూపించడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

సినిమాలో విలన్ ఆ హీరోయిన్ భర్త అంటే అదో రకం పబ్లిసిటీగా మారింది. ఇప్పటికే ఖైది నంబర్ 150లో తరుణ్ అరోరా ఒకప్పటి క్రేజీ హీరోయిన్ అంజలా ఝవేరి భర్తని ఆ రకంగా కూడా సినిమా మీద క్రేజ్ తెచ్చారు. ఇప్పుడు అదే పద్ధతిలో హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్స్ లో అలరించిన స్నేహ తన భర్తను విలన్ గా మార్చింది. ఆల్రెడీ తమిళంలో హీరోగా చేస్తూనే వెరైటీ పాత్రలు చేస్తున్న ప్రసన్న తేజ్ జవాన్ లో విలన్ గా చేస్తున్నాడు. అయితే ప్రసన్న విలన్ గా చేస్తున్న విషయం చిత్రయూనిట్ రహస్యంగా ఉంచుతుందట. మరి ప్రసన్నతో తేజ్ చేసే ఫైటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.