
ఓ పక్క నిర్మాతగా సూపర్ సక్సెస్ లో ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా కూడా అదే ఫాం కొనసాగిస్తున్నాడు. ఒకానొక టైంలో తను ప్రొడ్యూస్ చేసిన సినిమాల కన్నా డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలే ఎక్కువ లాభాలను మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి దిల్ రాజు తెలిసి తెలిసి తప్పులో కాలేశాడు.. అదేనండి పప్పులో కాలేశాడు. మణిరత్నం చెలియా సినిమాను తెలుగు వర్షన్ రిలీజ్ చేసిన దిల్ రాజు సినిమా కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారట.
సినిమా కూడా తానే రిలీజ్ చేయడం జరిగిందట. మొదటి షో నుండే బాబోయ్ అంటూ ప్రేక్షకులు సినిమా మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. మొదటి వారాంతరం కేవలం రెండు కోట్లు మాత్రమే కలక్షన్స్ వచ్చాయట. ఇక రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల ధాటికి చెలియా నిలబడే ఛాన్సే లేదు. సో ఎటు చూసినా దిల్ రాజు చెలియా సినిమాకు పెట్టిన మొత్తం లాసే అంటున్నారు. మణిరత్నం కార్తిల క్రేజీ కాంబినేషన్ అని సినిమా కొన్న దిల్ రాజు వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యాడని తెలుస్తుంది.