జైలవకుశ అప్పుడే లాభాలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న మూవీ జై లవకుశ. శ్రీరామ నవమి కానుకగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తారక్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని తెలిసిందే. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ 55 కోట్ల లోపే ముగించాలని ప్లాన్ చేశారట. అనుకున్నట్టుగానే బడ్జెట్ లిమిట్స్ తోనే షూటింగ్ పూర్తవుతుందట. భారీగా ఖర్చుపెట్టే ఆలోచన లేకనే హీరోయిన్ గా రాశి ఖన్నా, నివేదా థామస్ లను తీసుకున్నారు.   


ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకు అప్పుడే లాభాలొచ్చాయని అంటున్నారు. అదెలా అంటే 50 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందట. సో 30 కోట్ల లాభంతో దూసుకెళ్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ సక్సెస్ తో తారక్ సినిమా మీద గురి ఏర్పడింది. అందుకే గ్యారేజ్ హయ్యెస్ట్ కలక్షన్స్ వచ్చిన రేటుకే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా లాభాల బాట పట్టడం విశేషం.