
సూపర్ స్టార్ రజినికాంత్ అల్లుడు ధనుష్ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే.. ఇప్పటికే హీరోగా ఉంటూనే నిర్మాతగా మారిన ధనుష్ ఇప్పుడు కొత్తగా దర్శకుడిగా కూడా టర్న్ తీసుకున్నాడు. ధనుష్ డైరక్షన్ లో నిన్న రిలీజ్ అయిన సినిమా పవర్ పాండి. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై టాలీవుడ్ కన్ను పడింది. రజిని అల్లుడు తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా చూసేందుకు రజిని తరపునుండి ఇన్విటేషన్ అందుకున్నాడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు.
మోహన్ బాబుతో కలిసి రజిని ఈ సినిమా వీక్షించారట. అయితే సినిమా చూసిన మోహన్ బాబు సినిమాను తెలుగులో మనోజ్ తీస్తే బాగుంటుందని అనుకున్నాడట. రజిని సలహా మేరకే ఈ అభిప్రాయానికి వచ్చాడని తెలుస్తుంది. రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ చేసింది. ధనుష్ కూడా ఇందులో నటించాడు. మరి పవర్ పాండిగా మంచు మనోజ్ వస్తాడో రాడో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.