ఆర్మీ మ్యాన్ గా అల్లు అర్జున్..!

స్టైలిష్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో దువ్వాడ జగన్నాధం మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరక్షన్ లో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. రామలక్ష్మి సిని క్రియేషన్స్ పతాకంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించనున్నాడట అల్లు అర్జున్. 

సినిమా మొదట పావుగంట కార్గిల్ వార్ తరహాలో సీన్స్ ఉంటాయట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్టోరీ బోర్డ్ తయారు చేశారట. సరైనోడులో ఆర్మీ రిటర్న్ ఆఫీసర్ గా కనిపించిన అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో యుద్ధాలు కూడా చేస్తాడట. బన్ని రేంజ్ ను పెంచబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడవుతాయి. ఇన్నాళ్ళు రచయితగా సూపర్ సక్సెస్ అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఓ మార్క్ వేసుకోవాలని చూస్తున్నాడు.