
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినిమా.. ఈ టైటిల్ చూసి కాస్త షాక్ అవడం మాములే.. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన పూరి సంపూతో సినిమా సినిమాకు సిద్ధమయ్యాడంటే తన రేంజ్ పడిపోయిందా అన్న టాక్ ఓ పక్క వినబడుతున్నా ప్రస్తుతం చేస్తున్న బాలయ్య మూవీపై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి.
రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సాంగ్ ట్రైలర్ రిలీజ్ చేసిన పూరి సంపూతో సినిమా చేయాలని అనుకున్నా కాని కుదరలేదని అన్నాడు. పూరి సంపూని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడా లేక సినిమాలో ఏదో ఒక క్యారక్టర్ ఇద్దామనుకున్నాడా అన్నది చెప్పలేదు. ఒకవేళ సంపూర్ణేష్ హీరోగా పూరి సినిమా తీస్తే మాత్రం అది ట్రెండ్ సెట్ చేయడం ఖాయం.. ప్రతి సినిమాలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే సంపూ పూరితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలి.