
బాహుబలి సినిమాతో ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా బెస్ట్ స్క్రీన్ షేరింగ్ అంటే ప్రభాస్, రానాలదే అంటున్నారు. ఇంతకుముందు మల్టీస్టారర్ సినిమాలొచ్చినా బాహుబలి ప్రభాస్, రానాలు మాత్రం చాలా ప్రత్యేకం అయితే ఇదే విషయాన్ని రానా దగ్గర ప్రస్థావిస్తే మాత్రం తనకు రజినికాంత్, అమితాబ్ బచ్చన్ తో కలిసి చేయాలని ఉందని అంటున్నాడు.
దేశమంతా ప్రభాస్, రానాల గురించి పొగుడుతుంటే రానా మాత్రం బిగ్ బి అమితాబ్, సూపర్ స్టార్ రజినిలతో కలిసి ఒకే సినిమాలో చేయాలని అంటున్నాడు. ఆ ఇద్దరు కలిసి ఇప్పట్లో ఓ సినిమా చేసే అవకాశం ఉదంటారా.. స్వతహాగా సూపర్ స్టార్ క్రేజ్ దక్కించుకున్న ఈ ఇద్దరు స్టార్ లతో కలిసి చేయాలని తన విచిత్రమైన కోరిక బయట పెట్టాడు రానా. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం బాహుబలి-2 ప్రమోషన్స్ లో దేశమంతా సంచరిస్తున్నారు చిత్రయూనిట్. ఏప్రిల్ 28న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.