నానికి అందిన మెగాస్టార్ గిఫ్ట్..!

చిరు షోలో బాలుడి కోరిక తీరింది.. చిరంజీవి గారు తనకో సూపర్ కూల్ సైకిల్ కొనిచ్చారంటూ ట్విట్టర్ లో డప్పేసి చెబుతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇంతకీ అసలు విషయం ఏంటంటే రీసెంట్ గా మెగాస్టార్ హోస్ట్ గా నడిపిస్తున్న మీలో ఎవరు కోటిశ్వరుడు ప్రోగ్రాంకు గెస్ట్ గా వెల్లిన నాని మాస్టర్ సినిమా టైంలో తన సైకిల్ పోయిన విషయం గుర్తుచేశాడు. ఆ షోలో చిరు నానికి తన తరపునుండి ఓ సైకిల్ కొనిస్తా అని మాటిచ్చాడు చిరంజీవి. 

ఇచ్చిన మాట ప్రకారంగానే నానికి సైకిల్ పంపించారట. అదే విషయం ట్విట్టర్ లో #MegastarForAReason (మెగాస్టార్ ఫర్ ఏ రీజన్) అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు నాని. అంతేకాదు అందుకున్న సైకిల్ పిక్ తో పాటుగా చిరుతో ఆ షోలో తాను దిగిన పిక్ కూడా షేర్ చేశాడు. మొత్తానికి అలా తను పోగొట్టుకున్న సైకిల్ ఆ హీరో చేతే ఇప్పించుకుని శభాష్ అనిపించుకున్నాడు నాని.