
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం రాజమండ్రి దగ్గరలో షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ క్రేజీ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడని టాక్. లెజెండ్ తో విలన్ గా టర్న్ తీసుకున్న జగ్గు భాయ్ సూపర్ క్లిక్ అవ్వడమే కాకుండా మరో పక్క సపోర్టెడ్ రోల్స్ లో కూడా అదరగొడుతున్నాడు.
ఇక చరణ్ సినిమా కోసం సుకుమార్ జగపతి బాబుకి స్టోరీ నేరేట్ చేశాడట. విలన్ క్యారక్టర్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించడంతో జగపతి బాబు వెంటనే ఓకే చెప్పాడట. ఇప్పటికే సుకుమార్ నాన్నకు ప్రేమతోలో విలన్ గా నటించిన జగపతి బాబు మరోసారి చరణ్ తో ఫైట్ చేయబోతున్నాడు. స్టైలిష్ విలన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాకు రేపల్లె, మొగళ్తూరు మొగనగాడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈమధ్యనే ఈ సినిమాలోని చరణ్ లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.