
కోలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య గొడవలు ముదురుతున్నాయి.. ముఖ్యంగా సుచి లీక్స్ రివీల్ అయిన దగ్గర నుండి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను వ్యతిరేకించే వారు ఎక్కువయ్యారు. ఆ క్రమంలో భాగంగా ధనుష్ తో కలిసి నటించిన మడోన్నా సెబాస్టియన్ తనని హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇచ్చిందట. ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా ట్రెండింగ్ అవుతుంది.
ధనుష్, మడోన్నా కలిసి నటించిన సినిమా పవర్ పాండి. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ టైంలో ధనుష్ మడోన్నాల మధ్య గొడవ అయ్యిందట. అప్పటినుండి ధనుష్ పేరు వింటే ఫైర్ అవుతుంది మడోన్నా. మలయాళ ప్రేమం ఎంట్రీతోనే సూపర్ హిట్ అందుకున్న మడోన్నా సెబాస్టియన్ తెలుగులో కూడా ఆ సినిమా రీమేక్ లో తన రోల్ తానే చేసింది. మరి ధనుష్ పై మడోన్నా గొడవ ఏంటో తెలియదు కాని రజిని అల్లుడి మీద విమర్శనాస్త్రాలు ఎక్కువయ్యాయని మాత్రం కోలీవుడ్ మీడియా ఫోకస్ పెట్టింది.