స్టైలిష్ హీరో రానా..!

రానా దగ్గుబాటి.. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ హీరో క్రేజ్ ఓ రేంజ్ లో ఉండిందని చెప్పొచ్చు. ఇక్కడ స్టార్ హీరోల్లా కేవలం తెలుగు సినిమాల వరకే పరిమితం కాకుండా బాలీవుడ్ లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చాడు రానా. ఇక బాహుబలితో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకోవడంలో రానా సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం బాహుబలి-2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానాను ఓ ఇద్దరు భామలతో ఉన్న పిక్ మ్యాక్సిం కవర్ పేజ్ గా వేశారు. రానా దగ్గుబాటి ద న్యూ మ్యాన్ ఆఫ్ స్టైల్ అంటూ రానా గురించి వేశారు. మోత్తానికి సౌత్ స్టార్ గా ఉన్న రానా బీ టౌన్ లో బాగానే క్రేజ్ సంపాదించాడు. మ్యాక్సిం కవర్ పేజ్ లో రానా లుక్ చూస్తే నిజంగా స్టైలిష్ స్టార్ అనేయక తప్పదు.