
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్.. నిన్న సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ కు గిఫ్ట్ అందించిన మహేష్ తన లుక్స్ తో ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీస్ ను కూడా ఆశ్చర్యపరచాడు. ఇక స్పైడర్ ఫస్ట్ లుక్ మీద తన అభిప్రాయాన్ని తెలిపాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. గూడాచారిగా తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ మహేష్ అన్న అద్భుతంగా కనిపిస్తున్నాడు అని స్పైడర్ ఫస్ట్ లుక్ పై ట్వీట్ చేశాడు సాయి ధరం తేజ్.
మిగతా హీరోలెలా టాలీవుడ్ లో ఏ హీరో పోస్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన ముందుగా స్పందించే తేజ్ మహేష్ పోస్టర్ మీద తన మార్క్ కామెంట్ తో అలరించాడు. ఓ పక్క మెగా ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరుగుతున్నా సరే అవేవి పట్టించుకోకుండా తన మనసులోని అభిప్రాయాన్ని ట్వీట్ చేసి మహేష్ ఫ్యాన్స్ మనసు గెలిచాడు తేజ్. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న మహేష్ మురుగదాస్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.