సౌత్ క్వీన్ తమన్నా వల్లే ఆగిందట..!

2014లో వచ్చిన బాలీవుడ్ క్వీన్ మూవీ ఎంతటి సంచలన విజయం అందుకుందో తెలిసిందే. కంగనా నట విశ్వరూపం చూపించిన ఆ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఆ సినిమాను సౌత్ లో రీమేక్ చేసేలా నాలుగు భాష హక్కులను పొందారు తమిళ నటుడు నిర్మాత త్యాగరాజన్. తెలుగు తమిళ భాషల్లో తమన్నాతో ఆ సినిమా రీమేక్ చేయాలని రెండేళ్ల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్పుడు అంటూ చెప్పుకొచ్చిన ఆ సినిమా ఇప్పుడు పూర్తిగా అటకెక్కిందని టాక్. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ప్రస్తుతానికి సౌత్ క్వీన్ మూవీని ఆపేస్తున్నట్టు ఎనౌన్స్ చేశాడు త్యాగరాజన్.

అయితే కోలీవుడ్ టాక్ ఏంటంటే ఈ సినిమా కోసం తమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట. అందుకే ఆ సినిమా పట్టాలెక్కలేదని అంటున్నారు. ఏ తమన్నా కాకపోతే మరో హీరోయిన్ అందుకు సరిపోదా అంటే మాత్రం మాట్లాడట్లేదు. తమన్నానే చేయాలని మేమే తీయాలి అన్న తీరున ఉంది. రేవతి డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా కేవలం తమన్నా వల్లే ఆగిందని అందరు అనుకుంటున్నారు. మరి అంతటి క్రేజీ ప్రాజెక్ట్ కోసం అమ్మడు కాస్త కూస్తో తగ్గొచ్చు కదా అని అందరి మాట.