
సూపర్ స్టార్ మహేష్ మరోసారి రాజకీయాల మీద తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సినిమా హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఈమధ్య కామన్ అయ్యింది. ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు ఈ క్రమంలో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా.. కొత్త పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీల్లో చేరుతారా అని తమిళ మీడియా అడిగింది. దానికి మహేష్ మాత్రం ఎప్పటి ఆన్సరే చెప్పాడు. రాజకీయాల్లో తనకు అసలు అవగాహన లేదని బదులిచ్చాడు.
మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున ఎంపిగా చేశారు. ఇక ప్రస్తుతం మహేష్ బావ గల్లా జయదేవ్ ఏపిలో టిడిపి ఎంపిగా ఉన్నారు. మరి ఇంతమంది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంచుకుని కూడా మహేష్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు అనడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మొదటి నుండి మహేష్ నో పాలిటిక్స్ అంటున్నాడు కాబట్టి తాను ఇలానే హీరోగా కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.