బాహుబలి-2 రిలీజ్ కష్టాలు..!

ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ అవబోతున్న బాహుబలి-2కి ఇప్పటికే కన్నడ పరిశ్రమలో విడుదల చేసేది లేదంటూ నిరసలను చేస్తుంటే మరో పక్క తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. సత్యరాజ్ మూలానా కర్ణాటకలో బాహుబలి-2 రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వల్ల తమిళనాడులో కూడా రిలీజ్ కష్టాలు పడేలా కనిపిస్తుంది.   

బాహుబలి బిగినింగ్ కు సంబందించి తనకు నిర్మాతలు బాకీ ఉన్నారని.. అవి క్లియర్ చేస్తే తప్ప బాహుబలి-2 రిలీజ్ అవనివ్వనని కోర్ట్ లో పిటీషన్ వేశాడట తమిళ డిస్ట్రిబ్యూటర్ శరవణన్. ఆ పిటీషన్ స్వీకరించిన కోర్ట్ విచారణ కోసం స్టే ఇచ్చిన ఇవ్వొచ్చని అంటున్నారు. అలా అయితే బాహుబలి-2 రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎవరేం చేసినా బాహుబలి-2 మాత్రం అనుకున్న టైంకు రిలీజ్ అవ్వడం తద్యం అంటున్నారు నిర్మాతలు.