చిరు పవన్ రూమర్స్ పై వరుణ్ తేజ్..!

మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే.. మెగా హీరోలంతా ఒక్కటే అన్న మాట వినిపిస్తున్నా ఎక్కడో ఓ చోట మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ ఉన్నట్టా లేనట్టా అన్న వాదన వినపడుతుంది. అవకాశం వచ్చినప్పుడల్లా అన్నయ్య మీద తమ్ముడు తమ్ముడి మీద అన్నయ్య అభిమానం చూపిస్తున్నా సరే ఎక్కడో ఓ చోట మిస్ ఫైర్ అవుతుంది. అది మీడియా వారికి మంచి న్యూస్ అవుతుంది. ఖైది నంబర్ 150కి పవన్ రాకపోడానికి ఇద్దరి మధ్య గొడవలే కారణం అంటూ వార్తలు పుట్టించారు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అవడంతో పవన్ ట్వీట్ చేసి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు లేండి.  

అయితే ఈ వార్తలపై మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం చాలా అప్సెట్ అవుతున్నాడని తెలుస్తుంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మధ్య ఏమి లేకపోయినా ఏదో ఉందని వార్తలు రావడం తనని బాధిస్తున్నాయని అంటున్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిసినా సరే కావాలని వార్తలు రాస్తున్నారని వాపోయాడు. ఎన్నిసార్లు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చినా మీడియా మాత్రం మళ్లీ అదే న్యూస్ హైలెట్ చేస్తున్నారని గుర్తుచేశాడు. వరుణ్ చెప్పినదానిలో నిజం ఉన్నా ఇద్దరి మధ్య అంత ఇది ఉంటే ఒకరి ఫంక్షన్ కు ఒకరు రెగ్యులర్ గా ఎందుకు అటెండ్ అవ్వరు అన్నది కొందరి ప్రశ్న. ఏది ఏమైనా మెగా హీరోల మధ్య అదేనండి మెగా పవర్ వార్ మధ్యలో మెగా హీరోలు ఒకాళ్తా పుచ్చుకుని ఆ దూరం దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.   అది ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.