
ఫ్యాన్స్ మధ్య గొడవలు మితిమీరుతుంటే స్టార్స్ మధ్య మాత్రం సాన్నిహిత్యం పెరిగిపోతుంది. టాలీవుడ్ లో ఎవరికి వారు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు మహేష్ చరణ్ లు.. ఈ ఇద్దరు సినిమాల్లో ఏ ఒక్కటి అటు ఇటుగా ఉన్నా మిగతా హీరో ఫ్యాన్స్ దాన్ని చీల్చి చెండాడుతారు.. బ్రహ్మోత్సవం విషయంలో అది ఏ రేంజ్ లో వెళ్లిందో తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య ఈ రేంజ్ గొడవలుంటే మా ఇద్దరి మధ్య మాత్రం మంచి స్నేహం ఉంది అంటున్నాడు మహేష్.
అవును నేను చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్.. తనే కాదు చిరంజీవి గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఆ విషయం తెలియక ఫ్యాన్స్ మాత్రం గొడవలు పెట్టుకుంటారు. ఇక కోలీవుడ్ విజయ్ అన్నా తనకు ఇష్టమని అన్నాడు మహేష్. తనతో మణిరత్నం డైరక్షన్ లో సినిమా చేయాల్సింది కాని అది మిస్ అయ్యిందని.. కోలీవుడ్ లో విజయ్ అంటే తనకు ఇష్టమని తమిళ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇక మురుగదాస్ తో చేస్తున్న స్పైడర్ లుక్ నిన్న రిలీజ్ అయ్యి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.