మణికర్ణికకు బాహుబలి పెన్..!

భారతీయ వీర నారి ఝాన్సి లక్ష్మి భాయ్ జీవిత కథతో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ గా సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ స్క్రీన్ ప్లే అందిస్తారని తెలుస్తుంది. బాహుబలితో పాటుగా భజరంగి భాయ్ జాన్ కథలతో ఇండియా ఫేమస్ అయిన ఈ రైటర్ ఇప్పుడు మణికర్ణిక సినిమాకు తన రచనా సహకారం అందించనున్నారు.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తన సత్తా చాటుకున్న క్రిష్ మరోసారి అలాంటి నేపథ్యమున్న కథనే తీసుకోవడం విశేషం. కంగనా రనౌత్ ఈ సినిమా నిర్మిస్తుండగా సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడవుతుంది. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న కంగనా మణికర్ణికతో కూడా అదిరిపోయే హిట్ అందుకుంటుందని ఆశిస్తున్నారు.