
ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఈరోజుకి ఫలించాయి. మురుగదాస్ మహేష్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. స్పైడర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు సంబందించిన రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఒకటి ఇంటెన్స్ తో ఉన్న లుక్ లో ఉండగా మరోటి టై కట్టుకుని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు మహేష్.
ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ స్పైడర్ లుక్ ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఇక మహేష్ ఫస్ట్ లుక్ చూసి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దేవుడితో పోల్చడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 14 తమిళ ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారని అంటున్నారు.